పోస్టర్ ఆవిష్కరణ
కెరమెరి: షష్టిని పురస్కరించుకుని మండలంలోని చిన్నపాట్నాపూర్ గ్రామంలో ఆదివారం నుంచి ఈ నెల 13వరకు నిర్వహించనున్న వంగెపురి భీమయ్యక్ దేవస్థాన పూజ, జాతర పోస్టర్‌ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి శనివారం ఆవి ష్కరించారు. ఆలయ కమిటీ నాయకులు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేను కలిసి జాతరకు రావాలని ఆహ్వానించారు. మూడురోజులపా టు నిర్వహించనున్న జాతరలో ఆటపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఆలయ కమిటీ సభ్యులు ఆత్రం దర్మూ, ఆత్రం యా దోరావు, సిడాం భీంరావు, టేకం గంగారాం, చహకటి మారుతి, ధంబీరావు ఉన్నారు.


