అమెరికాకు పంపిస్తాం
సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటకాలు, టిఫిన్స్ చేయడంలో బిజీ అవుతాను. బంధుమిత్రులతో కలిసి రకరకాల పిండివంటలు తయారు చేస్తాం. ముఖ్యంగా మా పిల్లలిద్దరు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. సంక్రాంతికి నేను చేసే పిండివంటలు మా పిల్లలకు ఎంతో ఇష్టం. వారి కోసం సకినాలు, అరిసెలు, కరిగెలు, పూతరేకులు, గారెలు, ఇతర పిండి వంటకాలు తయారు చేసి పంపిస్తాం. సంక్రాంతి పండుగకు వారికి చేరేలా పార్సిల్ చేస్తాం. ఇండియాలో లాగే అమెరికాలోనూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
– సునీత, గృహిణి, ఆసిఫాబాద్


