ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
ఆసిఫాబాద్: ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సిర్పూర్(టీ) మండలం అహ్మద్‌నగర్ వాసులు తమకు మూడు నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లే దని, తాగునీటిని పునరుద్ధరించాలని, కెరమెరి మండలం తుమ్ముగూడకు చెందిన చౌహాన్ అశ్విని తన భర్త మరణించడంతో ఇబ్బందులకు గురవుతున్నాననని, ఉపాధి కల్పించాలని, తిర్యాణి మండలం సుంగాపూర్‌కు చెందిన దుర్గం శంకర్ తాను సాగు చేసుకుంటున్న భూమికి పట్టా ఇప్పించాలని, వాంకిడి మండల కేంద్రానికి చెందిన దుర్గం శ్యాంరావు మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించా లని, రెబ్బెన మండలంలోని రాళ్లపేటకు చెందిన అజ్మెర అమృతబాయి వ్యవసాయ రుణం పునరుద్ధరించాలని, పిప్పిర్‌గోందికి చెందిన రాథోడ్ గులాబ్ ఉపాధి కల్పించాలని, కాగజ్‌నగర్ మండలం గన్నారంకు చెందిన నేర్పెల్లి పోశం భూమికి పట్టా ఇప్పించాలని, రెండు కళ్లూ లేని తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కెరమెరి మండలం కెలికె గ్రామానికి చెందిన మడా వి రాజు దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద జిల్లాలోని పీవీటీజీలకు ఇళ్లు మంజూరు చేయాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు.


