
గుణాత్మక విద్య అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సకల సదుపాయాలతో కూడిన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరమ్మతుల కోసం విడుదలైన నిధులతో కళాశాలలో అవసరమైన పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఆర్‌ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులు నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాందాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.