కాగజ్‌నగర్‌టౌన్: రాష్ట్రంలోని ఆరె కులస్తుల ను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గంలోని ఆరె కులస్తులు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 28 కులాలను ఓబీసీ జాబితా లో చేర్చాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి అతి త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చంకపురే గణపతి, డోకె దామోదర్, ఎలకరి దామోదర్, ఎల్ములే మల్లయ్య, సత్పుతే తుకారం, లోనారే రవీందర్, డుబ్బుల వెంకన్న, భరత్ తదితరులు ఉన్నారు.