
విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులను నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రీడాపాఠశాలలో ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పీడీలు, పీఈటీలకు గురువారం ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు. పలు సూచనలు చేశారు. డీటీడీవో మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. వ్యాయమ ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పుతూ క్రీడల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్‌వో మీనారెడ్డి, జీసీడీవో శకుంతల, ఏటీడీవో చిరంజీవి, హెచ్‌ఎం జంగు, కోచ్‌లు విద్యా సాగర్, అరవింద్, తిరు మల్, వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.