
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కాగజ్‌నగర్‌రూరల్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్‌నగర్ రూరల్ పోలీస్టేషన్‌ను గురువారం సందర్శించి పలు విభాగాలపై సమీక్షించారు. రికార్డులు, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, చార్జ్‌షీట్లు, తదితర రికార్డులు పరిశీలించారు. బ్లూకోల్ట్ సిబ్బంది డ్యూటీలో ఉన్నప్పుడు డయల్ 100కు వచ్చిన కాల్స్‌పై తక్షణమే స్పందించాలన్నారు. వేగంగా సంఘటన స్థలానికి చేరుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మెరుగైన సేవలందించేందుకు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచేవిధంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై సందీప్ పాల్గొన్నారు.