ఘనంగా నర్సుల దినోత్సవం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రిలో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించా రు. నర్సులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభా కాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సూపరింటెండెంట్ ఇందుమతిని శాలువాతో సన్మానించారు. వా రు మట్లాడుతూ ప్రేమ, ఓర్పు, సహనం కలి గిన అమ్మకు ప్రతిరూపంగా నర్సులు నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో తక్కువ వేతనంతోనూ సేవాభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. సమాజా నికి నర్సులు అందిస్తున్న సేవలకు గుర్తుగా, ఫ్లోరెన్స్ నైటింగల్ జయంతి రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు ప్రసాద్, స్రవంతి, ప్రసాద్, హెడ్ నర్స్ సఫియా, న ర్సింగ్ ఆఫీసర్స్ శ్రీదేవి, ఏసుకరుణ, కుసుమరాణి, భాగ్యలక్ష్మి, లలిత, పద్మ, హేమలత, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.


