ఆసిఫాబాద్: ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన ఎం.హారిక ప్రసవం కోసం ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు, స్కానింగ్ చేసిన అనంతరం గర్భంలో కవలలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టు లేకపోవడంతో 108 అంబులెన్స్‌లో మంచిర్యాలకు రెఫర్ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా రెబ్బెన సమీ పంలో ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంటీ టెక్నీషి యన్ హెచ్.వెంకటేశ్, పైలెట్ ఆర్.కార్తీక్ తెలి పారు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు.