పలువురు సీఐల బదిలీ | - | Sakshi
Sakshi News home page

పలువురు సీఐల బదిలీ

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

ఖమ్మం క్రైం: జిల్లాలో మరోసారి సీఐల బదిలీలు జరిగాయి. సత్తుపల్లి రూరల్‌ ీసీఐ ముత్తులింగయ్య గౌడ్‌ను ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేయగా ఖమ్మం సీసీఆర్‌బీలో పనిచేస్తున్న పి.సర్వయ్యను సత్తుపల్లి రూరల్‌కు కేటాయించారు. కాగా, సర్వయ్య గతంలో కల్లూరు ఎస్‌ఐగా కూడా విధులు నిర్వర్తించగా, మహబూబాబాద్‌ సీఐగా పనిచేశారు. ఇక గతంలో ఖమ్మం త్రీటౌన్‌ సీఐ పనిచేసి ఐజీ కార్యాలయానికి అటాచ్‌గా ఉన్న మోహన్‌బాబును సిద్దిపేట కమిషనరేట్‌లోని పీసీఆర్‌కు బదిలీ చేశారు. ఈమేరకు బుధవారం ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇంకొందరు సీఐల బదిలీ కూడా త్వరలో జరగనుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement