‘లక్కీ డ్రా’ప్‌ ఎవరికో ?! | - | Sakshi
Sakshi News home page

‘లక్కీ డ్రా’ప్‌ ఎవరికో ?!

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

● ఉమ్మడి జిల్లాలో రెండు బార్లకు 688 దరఖాస్తులు.. ● దరఖాస్తుల రూపంలోనే రూ.6.88 కోట్ల ఆదాయం ● రేపు డ్రా తీయనున్న అధికారులు

● ఉమ్మడి జిల్లాలో రెండు బార్లకు 688 దరఖాస్తులు.. ● దరఖాస్తుల రూపంలోనే రూ.6.88 కోట్ల ఆదాయం ● రేపు డ్రా తీయనున్న అధికారులు

ఖమ్మంక్రైం: ఎకై ్సజ్‌ శాఖ నూతనంగా ఉమ్మడి జిల్లాలో రెండు బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ఖమ్మం జిల్లా కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఒక్కో బార్‌ మంజూరయ్యాయి. ఆయా ప్రాంతాల్లో బార్ల ఏర్పాటు దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున ఫీజు నిర్దేశించగా.. మద్యం వ్యాపారులు పలువురు పోటీ పడడంతో పెద్దమొత్తంలో దరఖాస్తులు అందాయి. కల్లూరు బార్‌కు 331 దరఖాస్తులు నమోదు కావడంతో రూ.3.31కోట్లు, అశ్వారావుపేటలోని బార్‌కు 357 దరఖాస్తుల ద్వారా రూ.3.57కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరడం విశేషం.

ఆంధ్రా వ్యాపారుల కన్ను

కల్లూరు, అశ్వారావుపేట రెండు కూడా ఏపీకి సరిహద్దులో ఉంటాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు తదితర ప్రాంతాల మద్యం వ్యాపారులు రెండు బార్లను దక్కించుకునేందుకు దరఖాస్తులు అందించినట్లు తెలిసింది. ఎవరికి బార్‌ వచ్చినా సిండికేట్‌గా నిర్వహించాలనే యోచనతో పెద్దమొత్తంలో దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఏన్కూరు, కల్లూరు, తల్లాడ ప్రాంతాల్లో వైన్స్‌ నిర్వహిస్తున్న వారు, ఖమ్మంలోని పలు బార్ల యజమానులు కూడా పోటీ పడడంతోనే దరఖాస్తులు భారీగా నమోదయ్యాయని తెలుస్తోంది.

రేపు ఉన్నతాధికారుల సమక్షాన డ్రా

రెండు బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కొక్కరిని డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈమేరకు కల్లూరు బార్‌కు ఈనెల 16వ తేదీ శుక్రవారం కలెక్టర్‌ సమక్షాన, అశ్వారావుపేట బార్‌కు భద్రాద్రి కలెక్టరేట్‌లో లక్కీ డ్రా తీస్తారు. దరఖాస్తుదారులకు ఎంట్రీ పాస్‌లు జారీ చేస్తామని, పాస్‌ ఉన్న వారినే హాల్‌లోకి అనుమతిస్తామని ఎకై ్సజ్‌ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement