గిరగిర.. గింగిరాలు! | - | Sakshi
Sakshi News home page

గిరగిర.. గింగిరాలు!

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

జిల్లాలో భారీగా పెరుగుతున్న

విద్యుత్‌ డిమాండ్‌

కేటాయింపునకు మించి

కోటా వినియోగం

గృహ, వ్యవసాయ విద్యుత్‌

అవసరాలకు గరిష్టంగా వాడకం

అసహజ పరిస్థితులు

ఎల్‌నినో కారణంగా జిల్లా వాతావరణంలో తేమ తగ్గడంతో వర్షాలు సరైన స్థాయిలో కురవలేదు. రుతుపవనాలు, తుపాన్లు, అల్పపీడనాల ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు కురవాల్సిన జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వర్షాభావ పరిస్థితి ఎదురైంది. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడమే కాక సుదీర్ఘమైన పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఈ నేపథ్యాన జిల్లాలో రికార్డు స్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది.

సాగు కోసం..

వానాకాలం సీజన్‌లో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేశారు. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక జలాశయాలు, రిజర్వాయర్లలోకి నీరు చేరకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు బోర్లు, బావులపై ఆధారపడుతున్నారు. వీటి నుంచి మోటార్ల ద్వారా నీరు పంట అవసరాలకు ఉపయోగిస్తున్నారు. వర్షాలు లేక భూగర్భ జలాలు పడిపోవడంతో విద్యుత్‌ మోటార్ల వాడకం గంటల తరబడి కొనసాగుతోంది.

మండే ఎండలతో..

జిల్లాలో ఇప్పుడే వేసవిని తలపించేలా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్లలో ఉక్కపోత తట్టుకోలేక ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. సహజంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌లో వాతావరణం చల్లగానే ఉంటుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేక రోజంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఉపయోగిస్తుండడంతో విద్యుత్‌ ఎక్కువగా ఖర్చవుతోంది. అలాగే, పరిశ్రమలు, నీటి సరఫరా రంగాలకు సైతం విద్యుత్‌ వినియోగం కొంత ఎక్కువగానే ఉంది.

మారిన పరిస్థితి

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జిల్లాకు 154.50 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కోటా కేటాయిస్తే.. 188.94 మి. యూనిట్లు వాడారు. అంటే 34.44 మి. యూనిట్లు కోటా ఒకే నెలలోనే అధికంగా నమోదైంది. ఇక ఈనెల 12వ తేదీ వరకు వరకు 65.28 మి. యూనిట్ల కోటాకు 23.01 మి.యూనిట్లు అధికంగా 88.29 మి.యూనిట్ల మేర ఖర్చయింది.

గత ఏడాది మాత్రం కేటాయించిన కోటా తక్కువగానే వినియోగమైంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 151.32 మి. యూనిట్ల కోటాకు 151.79 మి.మీ. యూనిట్లు, అదే ఏడాది అక్టోబర్‌లో 182.59 మి.యూనిట్ల కోటాకు 160.56 మిలియన్‌ యూనిట్లే వినియోగం నమోదు కావడం గమనార్హం. నవంబర్‌లో 156 మిలియన్‌ యూనిట్లకు 142.20, డిసెంబర్‌లో 187.86 మి.యూనిట్లకు 180.81 మి.యూనిట్లు మాత్రమే వినియోగం జరగగా.. ఈసారి అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి.

జిల్లాలో విద్యుత్‌ వినియోగం తారాస్థాయికి చేరింది. వేసవిలో ఉండే డిమాండ్‌ ఇప్పుడే నమోదవుతోంది. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన గృహ, వ్యవసాయ రంగాల్లో విద్యుత్‌ ఉపయోగం పెరుగుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం

ఆగకుండా తిరుగుతున్న విద్యుత్‌ మీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement