సినిమా దర్శకుడు, నటుడు సత్యారెడ్డి
నేలకొండపల్లి: శాంతి సందేశంతో ‘కింగ్ బుద్ధ’పేరిట సినిమా రూపొందిస్తున్నట్లు డైరెక్టర్, నటుడు సత్యారెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రాన్ని మంగళవారం సందర్శించిన ఆయన సిని మా వివరాలు వెల్లడించారు. యుద్ధాలు, వాటి వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూనే శాంతి నెలకొల్పాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ అమెరికాలో మొదలుపెట్టగా.. ప్రస్తుతం థాయిలాండ్, వియత్నాం, శ్రీలంకలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. బౌద్ధమతం గొప్పతనాన్ని వివరిస్తూ ఇప్పటికే పది సినిమాలు తీయగా, కింగ్ బుద్ధ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నామని వెల్లడించారు. వచ్చే బుద్ధ జయంతి నాటికి పలు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాయగూడెం, బోదులబండ సర్పంచ్‌లు బోయిన వేణు, కట్టెకోల నాగార్జున, నాయకులు బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజని, మామిడి వెంకన్న, కోసూరి రాజాబాబు, బోయిన నరసింహారావు, కడియాల నరేష్ పాల్గొన్నారు.


