పెసలు కొనుగోలు చేయాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పెసలు కొనుగోలు చేయాలని ఆందోళన

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

వైరా: వైరా వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్‌ ద్వారా పెసలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించిన రైతులు మంగళవా రం ఆందోళనకు దిగారు. మార్కెట్‌ యార్డ్‌ ఎదుట రాష్ట్రీయ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రైతులకు సీపీఎం నాయకులు సుంకర సుధాకర్‌, కొంగర సుధాకర్‌ మద్దతు తెలిపి మాట్లాడుతూ.. పెసలు కొనుగోలు చేయడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళన విషయం తెలిసి తహసీల్దార్‌ సురేష్‌, ఎస్‌ఐ రామారావు అక్కడకు చేరుకుని మాట్లాడారు. కేంద్రానికి అధికారులు వస్తున్నారని, కొనుగోలు ప్రారంభిస్తారని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement