పది టేకుచెట్ల నరికివేత | - | Sakshi
Sakshi News home page

పది టేకుచెట్ల నరికివేత

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

కల్లూరురూరల్‌: కల్లూరు అటవీ శాఖ కార్యాలయం, మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం ఉన్న ఆవరణలోని పది టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. ఆపై కలపను రఘునాథగూడెం గ్రామ శివారుకు తరలించి నిల్వ చేయగా, అటవీ శాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ టేకు కలప విలువ మార్కెట్‌లో రూ.3 లక్షల మేర ఉంటుందని అంచనా. కార్యాలయాల ఆవరణకు వాచ్‌మెన్‌ లేకపోవడంతో అర్ధరాత్రి చెట్ల నరికినట్లు తెలుస్తోంది. అయితే, నిత్యం అటవీ సంరక్షణకు పాటుపడుతున్నామని చెప్పే అటవీ శాఖ కార్యాలయం ఉన్న ఆవరణ నుంచే చెట్లను ధైర్యంగా నరకడం, బయటకు తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం మంగళవారం బయటపడడంతో ఉద్యోగులు తనిఖీ చేపట్టి రఘునాథగూడెం శివారులో స్వాధీనం చేసుకుని తల్లాడలోని ఫారెస్ట్‌ రేంజర్‌ కార్యాలయానికి తరలించారు. మొత్తం పది చెట్లలో మూడు ఎండిపోయినవి కాగా, ఏడు పచ్చి చెట్లు ఉన్నాయి. కాగా, టేకు కలప 1.8 క్యూబిక్‌ మీటర్లుగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం విలువ రూ.1.95 లక్షలుగా నిర్ధారించి కేసు నమోదు చేసినట్లు రేంజ్‌ అధికారిని ఉమ తెలిపారు. అంతేకాక ఘటనకు బాధ్యుడిగా అనుమానిస్తున్న వ్యక్తిని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాజకీయ నాయకుడే సూత్రధారి

ఏకంగా అటవీ శాఖ కార్యాలయం ఉన్న ఆవరణ నుంచి టేకు చెట్లను నరికించి, తరలించడం వెనుక ఆ గ్రామ రాజకీయ నాయకుడి ‘హస్తం’ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు అటవీ శాఖ అధికారులు ఆయనను కూడా పిలిపించి వివరాలు సేకరించినట్లు సమాచారం.

అటవీ శాఖ కార్యాలయ ఆవరణలోనే ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement