కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాడాలి

Oct 14 2026 12:35 AM | Updated on Oct 14 2026 12:35 AM

సత్తుపల్లిటౌన్‌: సోషలిస్టు రాజ్యస్థాపన కోసం దేశంలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యంగా పోరాడడమే కాక సిద్ధాంత ఐక్యత కూడా అవసరమని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ కేంద్ర కమిటీ నాయకురాలు కె.రమ అన్నారు. సత్తుపల్లిలో మూడు రోజులుగా జరుగుతున్న మాస్‌లైన్‌ పార్టీ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా నాయకులు రమ, కృష్ణ మాట్లాడు తూ.. పార్టీల మధ్య సిద్ధాంత ఐక్యత లేకపోతే ముఠాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఆచరణ, చర్చల ద్వారా ఐక్యమై కార్మిక, రైతాంగ వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. పాలకులు కులం, మతం పేరుతో శ్రామిక వర్గ ప్రజలను విడదీస్తున్న నేపథ్యాన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, నాయకులు గుమ్మడి నరస య్య, కెచ్చల రంగారెడ్డి, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, సీ.వై.పుల్లయ్య, ఆవుల అశోక్‌, జి.రామయ్య, ముద్దా భిక్షం, కె.కల్పన, జి.లలిత, కూకలకుంట రవి, అమర్లపూడి రాము, జి.ప్రభాకర్‌, నూపా భాస్కర్‌, గంటా శ్రీనివాసరావు, లాజర్‌, అమర్లపూడి శరత్‌, కాటినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మాస్‌లైన్‌ కేంద్ర కమిటీ నాయకురాలు రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement