● నేడు టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ ● హోమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల, అధికారులు
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని కొత్తగూడెం – అల్లిపురం రహదారిపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ జరగనుంది. సుమారు 25వేల మంది భక్తులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. ఈమేరకు ఆదివారం నిర్మాణ స్థలంలో వివిధ ప్రాంతాల అర్చకులు శిలాన్యాసం, హోమ పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్‌దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అభస్త్య తదితరులు పాల్గొన్నారు. కాగా, సోమవారం చినజీయర్ స్వామి చేతుల మీదుగా భూమి పూజ జరగనుండగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అర్చకులు కూడా ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. పూజకు హాజరయ్యే ప్రతీ భక్తుడికి తిరుమల లడ్డూ ప్రసాదం అందించేలా ప్రత్యేక కౌంటర్లు, అన్నప్రసాద వితరణకు విస్తత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు. అలాగే, చిన్న జీయర్ స్వామి ప్రవచనాలు చేసేందుకు వేదిక సిద్ధం చేశారు.
20 ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణం
ఆలయ నిర్మాణానికి కొత్తగూడెం – అల్లిపురం రోడ్డును ఆనుకుని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని టీటీడీకి అప్పగించారు. ఈ స్థలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంతో ఖమ్మంకు ఆధ్యాత్మికంగా మరింత గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. కాగా, పూజలో పాలొన్న మంత్రి తుమ్మల ఏర్పాట్లపై పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు. సుడా, మార్కెట్, పీఏసీఎస్‌ల చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, యరగర్ల హన్మంతరావు, రావూరి సైదుబాబు, నాయకులు రాయల నాగేశ్వరరావు, పునుకొల్లు నీరజ, రావూరి కరుణ, కమర్తపు మురళి, కొత్తపల్లి నీరజ, సాధు రమేష్‌రెడ్డి, సంక్రాంతి నాగేశ్వరరావు, చేతుల నాగేశ్వరరావు, యుగంధర్, పగడాల మల్లేష్, కోటయ్య, గోవిందరావు, బోయిన లక్ష్మణ్‌గౌడ్, వీవీసీ గ్రూప్ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


