సత్తుపల్లిటౌన్: సమాజంలోని అసమానతలను రూపుమాపేది మార్క్సిజం మాత్రమేనని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు వెల్లడించారు. సత్తుపల్లిలో మూడు రోజుల పాటు జరిగే మాస్‌లైన్ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత మాస్‌లైన్ నాయకుడు గోకినేపల్లి వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరించగా, రంగారావు మాట్లాడారు. సమాజంలో వస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులను అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తేనే ఫలితా లు వస్తాయన్నారు. కార్యకర్తలు సైద్ధాంతికంగా అభివృద్ధి చెందడం, జ్ఞానాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించా లని సూచించారు. అనంతరం రాష్ట్ర నాయకురాలు ఎస్.ఎల్.పద్మ, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, నాయకులు కెచ్చల రంగారెడ్డి, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కె.రమ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేక, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట్లో తీసుకొని ఫాసిజం వైపు అడుగులేస్తుందని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థను ధ్వంసం చేయడానికి 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో నాయకులు సీ.వై.పుల్లయ్య, ముద్దా భిక్షం, ఎస్.కే.గౌస్, ఆవుల అశోక్, అమర్లపూడి రాము, కె.రవి, జి.లలిత, కె.కల్పన, జి.ప్రభాకర్, గంటా శ్రీనివాసరావు, బీరెల్లి లాజర్, కాటినేని శ్రీని వాసరావు, అమర్లపూడి శరత్, తాటి రాజు, కె.పుల్లారావు, ఒగ్గు నాగిరెడ్డి, కొర్సా వెంకటేష్, జె.మాల్యాద్రి, పరిమళ పాల్గొన్నారు.
మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు


