ఖమ్మం డిపో వద్ద తోపులాట..
రాష్ట్రస్థాయి...
రాష్ట్ర స్థాయికి మాత్రం ‘బస్సు’ వైపు తిరిగిన స్టీరింగ్ రీజియన్‌లో 1,726 ఓట్లతో 96.37 శాతం పోలింగ్ ఖమ్మం డిపో వద్ద స్వల్ప ఉద్రిక్తత
డిపోల వారీగా ఫలితాలు
(యూనియన్ నేతల లెక్కల ప్రకారం)
దశాబ్దకాలం తర్వాత ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించగా.. రీజియన్ స్థాయి గుర్తింపును ఐక్య కూటమి మద్దతుతో ‘స్టార్’ గుర్తుతో పోటీకి దిగిన ఎస్‌డబ్ల్యూఎఫ్(స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్) దక్కించుకుంది. పోలైన ఓట్లలో 51 శాతం పైగా సాధించడంతో రీజియన్ గుర్తింపు పొందింది. ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోలు, ఆర్‌ఎం కార్యాలయానికి గాను సత్తుపల్లి మినహా ఆరు డిపోల్లో ఐక్య కూటమి ఆధిక్యత కనబరిచింది. డిప్యూటీ రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కమిషనర్ లేబర్ ఎం.కోటేశ్వర్లు నేతృత్వాన శుక్రవారం ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో అధికారులు ముగించారు. – ఖమ్మం మయూరిసెంటర్
ఓటు వేస్తున్న మహిళా ఉద్యోగి
రీజియన్‌లో 96.37 శాతం పోలింగ్
ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోలు, ఆర్‌ఎం కార్యాలయం కలిపి ఎనిమిది బూత్‌లను ఏర్పాటుచేశారు. రీజియన్‌లో 1,791 ఓట్లగాను 1,726 ఓట్లు(96.37శాతం) పోలయ్యాయి. ఖమ్మం ఆర్‌ఎం కార్యాలయం బూత్‌లో 29 ఓట్లకు గాను 29 పోల్ కావడంతో వంద శాతం పోలింగ్ నమోదైంది.
ఖమ్మం డిపోలో..
ఎన్నికల అధికారులు ఖమ్మం బస్ డిపోలో డిపోకు ఒకటి, ఆర్‌ఎం కార్యాలయానికి ఇంకొకటి కలిపి రెండు బూత్‌లు ఏర్పాటుచేశారు. ఖమ్మం డిపోకు సంబంధించి 422 ఓట్లలో 411 ఓట్లు పోలయ్యాయి. నాలుగు ఓట్లు పోల్ కాకపోగా, మరో ఏడుగురు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరు ఈ నెల 14, 15 తేదీల్లో ఓటు వేస్తారు. అవి కూడా లెక్కించాక 17వ తేదీన అధికారిక ఫలితం వెల్లడించనున్నారు.
ఎస్‌డబ్ల్యూఎఫ్–టీడబ్ల్యూయూ
కూటమికే మెజారిటీ..
ఖమ్మం డిపోతో పాటు ఆర్‌ఎం కార్యాలయంలో ఐక్య కూటమికే మెజారిటీ ఓట్లు లభించాయి. ఖమ్మం డిపోలో పోలైన 411 ఓట్లలో రీజియన్ గుర్తింపునకు సంబంధించి ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు 260 ఓట్లు లభించాయి. ఎన్‌ఎంయూకు 141 ఓట్లు వచ్చాయి. ఐఎన్‌టీయూసీ ఒకటి, టీజీఎంయూకు మూడు, బీకేయూకు రెండు ఓట్లు రాగా.. మరో నాలుగు చెల్లలేదు. ఆర్‌ఎం కార్యాలయంలోని 29 ఓట్లలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు 22, ఏడు ఓట్లు ఎన్‌ఎంయూకు వచ్చాయి. రాష్ట్ర స్థాయి గుర్తింపునకు సంబంధించి ఖమ్మం డిపో పరిధిలో ఎంప్లాయిస్ యూనియన్‌కు 165 ఓట్లు రాగా.. టీయూడబ్ల్యూకు 243 ఓట్లు వచ్చాయి. ఇంకో మూడు చెల్లలేదు. ఆర్‌ఎం కార్యాలయానికి సంబంధించి 12 ఓట్లు ఎంప్లాయీస్ యూనియన్‌కు రాగా.. 17 ఓట్లు టీయూడబ్ల్యూకు నమోదయ్యాయి.
స్వల్పంగా క్రాసింగ్
గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమిగా, ఈయూ–ఎన్‌ఎంయూ కూటమిగా పోటీ చేశాయి. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించగా, విధులకు వెళ్లే ఉద్యోగులు ఓట్లు వేయడంతో మొదటి రెండు గంటల్లోనే గరిష్టంగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం గడువు ముగిశాక అధికారులు ఓట్లను లెక్కించారు. రీజియన్‌లో ఐక్య కూటమి మద్దతుతో పోటీ చేసిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు 1,092 ఓట్లు రాగా.. ఎన్‌ఎంయూకు 603 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర స్థాయి గుర్తింపునకు సంబంధించి రీజియన్‌లో టీడబ్ల్యూయూకు 1,005 ఓట్లు, ఈయూకు 707 ఓట్లు వచ్చాయి. రీజియన్‌లో ఐక్య కూటమికి వచ్చిన ఓట్లతో పోలిస్తే రాష్ట్ర స్థాయిలో స్వల్పంగా తగ్గాయి. ఇక రాష్ట్ర స్థాయిలో ఎంప్లాయీస్ యూనియన్‌కు వచ్చిన ఓట్లతో పోలిస్తే రీజియన్‌లో ఎన్‌ఎంయూకు ఓట్లు తగ్గడంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు భావిస్తున్నారు.
పోలింగ్ సమయాన ఖమ్మం బస్ డిపో వద్ద కార్మికుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఐక్య కూటమికి చెందిన ఓటర్ ఈయూ–ఎన్‌ఎంయూ
కూటమికి చెందిన వ్యక్తిని నెట్టివేశాడు.
దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా..
పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు
సర్దిచెప్పారు. ఐక్య కూటమికి చెందిన వ్యక్తిని
డిపో నుంచి పోలీసు వాహనంలో బయటకు తీసుకెళ్లారు.
ఆరు డిపోలతో పాటు ఆర్‌ఎం కార్యాలయంలో ‘స్టార్’ వెలుగులు


