ఫారం–6, 8 ద్వారా అందిన దరఖాస్తుల వివరాలు | - | Sakshi
Sakshi News home page

ఫారం–6, 8 ద్వారా అందిన దరఖాస్తుల వివరాలు

Oct 9 2026 12:38 AM | Updated on Oct 9 2026 12:38 AM

ఫారం–6, 8 ద్వారా అందిన దరఖాస్తుల వివరాలు

ఫారం – 6, 7, 8 కలిపి

24,172 మంది దరఖాస్తు

ఈనెల 7వ తేదీన ముగిసిన గడువు

అభ్యంతరాల పరిశీలన, ఓటరు

నమోదులో అధికారుల నిమగ్నం

ఖమ్మం జిల్లాలో...

‘సర్‌’ ప్రక్రియ ఈ ఏడాది జూన్‌ 15న మొదలుకాగా.. 1,460 మంది బీఎల్‌ఓలు పనిచేశారు. మొత్తం 12,43,781 మందికి ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ చేసి, తిరిగి సేకరించి ఆన్‌లైన్‌ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 17న ప్రకటించిన ముసాయిదా జాబితాలో 10,85,927 మంది ఓటర్లు ఉండగా, ఇందులో అనామలీస్‌, అన్‌మ్యాపింగ్‌ అయిన 1,75,841 మందిని గుర్తించారు. వీరికి నోటీసులు అందజేయగా.. ఈనెల 7వ తేదీ వరకు తమ అభ్యంతరాలను తెలపడంతో పాటు ఽధ్రువీకరణ పత్రాలు సమర్పించారు.

కొత్త ఓటర్లు, సవరణలు

జిల్లాలో కొత్తగా ఓటరు నమోదు, జాబితా నుంచి తొలగింపు, సవరణలు, మార్పులు, చేర్పుల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. 18 ఏళ్లు నిండి, ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఫారం–6 ద్వారా, ఓటరు జాబితా నుంచి పేరు తొలగించడానికి, ఒకరి పేరుపై అభ్యంతరం తెలపడానికి, మరణించిన వారు, శాశ్వతంగా మరో చోటుకు వెళ్లిన వారి పేర్లతో ఫారం–7 ద్వారా దరఖాస్తులు ఇచ్చారు. ఇప్పటికేఉన్న వివరాల్లో మార్పులు, సవరణలు, చిరునామా, ఎపిక్‌ మార్పిడికి ఫారం–8 ద్వారా దరఖాస్తు సమర్పించారు.

అత్యధికంగా మార్పుల కోసమే..

ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు, చిరునామా, ఎపిక్‌ నంబర్‌ మార్పిడి కోసం ఫారం – 8 ద్వారా అత్యధికంగా దరఖాస్తులు అందాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గాను ఈ కేటగిరీలో 16,159దరఖాస్తులు రాగా.. అధికారులు పరిశీలించారు. ఇందులో 6,250 ఓటర్లకు సంబంధించి వివరాలను జాబితాలో సవరించారు. ఇక ఫారం–6 ద్వారా కొత్త ఓటరు నమోదు కోసం 7,882 దరఖాస్తులు రాగా.. ఇప్పటి వరకు 840 మందిని చేర్చారు. ఇవికాక ఫారం – 7 ద్వారా 132 దరఖాస్తులు రాగా ఒకటి తిరస్కరించి 98 అంగీకరించారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి.

కాగా, ఫారం–6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తుల పరిశీలన వచ్చేనెల 5తో పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఓటరు జాబితాలో సవరణకు 16వేల దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement