ఖమ్మంమయూరిసెంటర్: స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్(సుడా) మాస్టర్ ప్లాన్ తుది ఆమోదం కోసం ప్రభుత్వం వద్దకు చేరింది. ముసాయిదాపై ప్రజల నుంచి అందిన అభ్యంతరాలను పరిశీలించాక మార్పులు, చేర్పులు చేశారు. ఆపై తుది ప్లాన్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే, ఆమోదం కోసం స్పష్టంగా ఉండేలా ప్రతులు కావాలని ఆదేశాలు అందడంతో గురువారం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ నేతృత్వాన పరిశీలించి పంపించారు.
త్వరలోనే ఆమోదం..
ఖమ్మం కార్పొరేషన్ తో పాటు, వైరా, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని 46 గ్రామపంచాయతీల్లో విస్తరించి ఉన్న ‘సుడా’కు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించారు. నివాస, వ్యాపార, పరిశ్రమల ప్రాంతాలతో పాటు రిక్రియేషన్, పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్లు, రోడ్లు, చెరువులు, కాల్వలు, వాగుల వివరాలు పొందుపరిచారు. మొత్తంగా కేఎంసీతో పాటు 46 జీపీలను కలుపుకుని 536 చదరపు కి.మీ. వైశాల్యంతో రాబోయే ఇరవై ఏళ్ల సరిపడా అవసరాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ ప్లాన్‌ను ఉన్నతాధికారులు పరిశీలించాక త్వరలోనే ప్రభుత్వం గెజిట్ ద్వారా ఆమోదం తెలపనుందని తెలిసింది.
త్వరలోనే అమలు చేస్తూ గెజిట్ విడుదల?


