ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం

Oct 9 2026 12:38 AM | Updated on Oct 9 2026 12:38 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్‌కుమార్‌ను అడ్డం పెట్టుకుని ప్రజల ఓటు హక్కును కాలరాసే కుట్ర చేస్తోందని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, మాస్‌లైన్‌, న్యూడెమోక్రసీ, టీజేఎస్‌, ఆప్‌, సీసీఏ ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు బుధవారం ఖమ్మంలోని పెవిలియన్‌ మైదానం నుంచి జెడ్పీ సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణగౌడ్‌, నాగండ్ల దీపక్‌చౌదరి, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మాస్‌లైన్‌, ఎన్‌డీ, టీజేఎస్‌ నాయకులు గుమ్మడి నర్సయ్య, ఆవునూరి మధు, గోపగాని శంకర్‌, సీసీఏ బాధ్యులు రవిమారుత్‌ మాట్లాడుతూ దేశ పౌరుల హక్కులను హరించే చర్యలపై అంతా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ‘సర్‌’ పేరుతో దేశంలో ఇప్పటికే 13 కోట్లమంది ఓటర్ల పేర్లను జాబి తా నుంచి తొలగించే కుట్ర జరగగా, అభ్యంతరాల ను సైతం లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా లేని వర్గాలు, యువత ఓట్ల ను తొలగించేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించా రు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేయాలని.. జ్ఞానేష్‌కుమార్‌తో పాటు ఆయనను నడిపిస్తున్న ప్రధాని మోడీ, అమిత్‌ షాపై క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, విజయబాయి, తుమ్మల యుగంధర్‌, వడ్డేబోయిన నరసింహారావు, సీ.వై.పుల్లయ్య, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్‌, జితేందర్‌రెడ్డి, జానీమియా, యర్రా బాబు, ఐవీ రమణారావు, దేవిరెడ్డి విజయ్‌, దొబ్బల సౌజన్య, సయ్యద్‌ గౌస్‌, మొక్క శేఖర్‌గౌడ్‌, బొడ్డు బొందయ్య, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇండియా కూటమి ఆధ్వర్యాన ర్యాలీ, నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement