నేలకొండపల్లి: ప్రపంచ శాంతి కోసం బుద్ధిస్టులు చేపట్టిన ర్యాలీ ఈనెల 13న మండలంలోని బౌద్ధక్షేత్రానికి చేరనుంది. కాంబోండియా, థాయ్‌ల్యాండ్ తదితర దేశాలతో పాటు మన దేశంలోని బౌద్ధబిక్షువులు 15మంది ఈ బృందంలో ఉంటారు. ఈమేరకు వారి ప్రసంగాలకు వేదిక, ర్యాలీకి ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. దీంతో అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డి, డీపీఓ వినోద్‌కుమార్, జిల్లా టూరి జం అధికారి సుమన్ చక్రవర్తి శుక్రవారం బౌద్ధక్షేత్రాన్ని పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. బౌద్ధ గురువు బంతె సద్ధారక్తిత, డీఐఈఓ కె.రవిబాబు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఎంపీఓ ఎం.శ్రీనివాసరావు, డి.రవికుమార్ పాల్గొన్నారు.
శరవేగంగా భూముల రీసర్వే
జిల్లాలో భూముల రీసర్వే శరవేగంగా జరుగుతోందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండలంలోని కొంగరలో సర్వే పూర్తికాగా, ఆయన పరిశీలించి మాట్లాడారు. సర్వే తీరు, వివాదాస్పద భూములు, రైతుల నుంచి అందిన సహకారంపై ఉద్యోగులతో చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు నోటీసులు ఇవ్వనుండగా, 60 రోజుల్లో అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. వీటిని పరిష్కరించాక మ్యాప్‌తో కూడిన పట్టా పుస్తకాలు అందిస్తామని తెలిపారు. తహసీల్దార్ పి.రాంప్రసాద్, సర్పంచ్ బోయిన వేణు, జీపీఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు. కాగా, కొంగరలో గత నెల 16న మొదలైన సర్వేను 20రోజుల్లో పూర్తిచేశారు. ఈ సందర్భంగా సహకరించిన రైతులకు తహసీల్దార్ రాంప్రసాద్ కృతజ్ఞతలు తెలపగా, సర్వేయర్లను అభినందించారు. ఎంఆర్‌ఐ మధుసూదన్‌రావు, సర్వేయర్ అశోక్‌తో పాటు తిరుపతిరావు, సందీప్ పాల్గొన్నారు.


