వైరారూరల్: మండలంలోని నారపునేనిపల్లికి మహిళా సంఘాల సభ్యుల సీ్త్రనిధి నగదును గ్రామదీపిక బొల్లినేని హేమ స్వాహా చేసింది. గ్రామంలో 12 గ్రూపులకు చెందిన సీ్త్రనిధి నగదును ఆమెకు అందించగా, బ్యాంకులో చెల్లించకుండా రూ.6.79 లక్షల మేర సొంతానికి వాడుకున్నట్లు బయటపడింది. గ్రూప్ సభ్యులు నెలనెలా కట్టిన నగదు బ్యాంకులో జమ చేయకపోవడంతో అనుమానం వచ్చి గ్రామదీపికను నిలదీయడంతో కుటుంబ అవసరాలకు వాడుకున్నందున తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది. కానీ, నెలలు గడుస్తున్నా నగదు ఇవ్వకపోవడంతో సభ్యులు ఒత్తిడి చేయగా హేమ ఫోన్ స్విచాఫ్ చేసి ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో సభ్యులు ఐకేపీ ఏపీఓతో పాటు సర్పంచ్‌కు ఫిర్యాదు చేయగా మంగళవారం విచారణ చేపట్టారు.


