బొమ్మ కాలేజీకి మరో పేటెంట్
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని బొమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీకి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విభాగం నుంచి పేటెంట్ లభించిందని చైర్మన్ బొమ్మ రాజేశ్వరావు తెలిపారు. ఏపోవర్డ్(ప్రొటీన్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ అపరేటస్) పేరిట కృత్రిమ మేధస్సు ఆధారిత గణన నమూనాలను ఉపయోగించి ప్రొటీన్ల నిర్మాణాన్ని కచ్చి తంగా గుర్తించే అంశానికి పేటెంట్ మంజూరు చేశారని వెల్లడించారు. వరుసగా నాలుగు పేటెంట్లు సాధించడం తమ కాలేజీకి గర్వకారణమని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభాస్కరరావుతో పాటు సంతోష్, కిరణ్ జ్యోతి, సాయి సంధ్య, అనిత, మృదుల, సిద్ధార్థ్, భార్గవి, ముస్కాన్, మనోహర్, కార్తీక్ ఇందులో పాలుపంచుకున్నారని వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, ఉదారు శ్రీధర్, మాధవి, అనూష, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అన్నదానానికి
రూ.లక్ష వితరణ
మధిర: మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవా లయంలో ప్రతీ శనివారం జరిగే అన్నదానానికి తల్లపురెడ్డి నాగిరెడ్డి సతీమణి కృష్ణకుమారి జ్ఞాపకార్ధం రూ.1,00,116ను అందజేశారు. ఈ నగదును ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లాది వాసుకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి, ఆలయ కమిటీ బాధ్యులు రేగళ్ల సునీత, కొంగర మురళి తదితరులు పాల్గొన్నారు.
హైస్కూల్ డైరెక్టర్ కుటుంబానికి...
ఖమ్మం అర్బన్: ఖమ్మం పాండురంగాపురంలోని చైతన్య హైస్కూల్ డైరెక్టర్ షేక్ అక్బర్ ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు పూర్వ విద్యార్థులు 60మంది సేకరించిన రూ. 1,01,500 నగదును వారి కుటుంబానికి మంగళవారం అందజేశారు. విద్యాబుద్ధులు నేర్పి తాము జీవితంలో స్థిరపడడానికి అక్బర్ పాటుపడ్డారని గుర్తు చేసుకున్నారు.
జాతర ఆదాయం..
రూ.1.57 లక్షలు అధికం
పెనుబల్లి: మండలంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతరలో షాపుల ఏర్పాటుకు మంగళవారం వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు అమ్మేందుకు గత ఏడాది రూ.1.61లక్షలు పలకగా ఈసారి రూ.2.01లక్షలకు చేరింది. ప్రసాదం అమ్మకానికి గత సంవత్సరం రూ.2.10లక్షలు వస్తే ఈసారి రూ.2.61లక్షలకు, కొబ్బరిచిప్పలు పోగు చేసుకునే హక్కు గత ఏడాది రూ.34వేలు పాడితే ప్రస్తుతం రూ.77వేలకు చేరింది. ఇక తలనీలాలు పోగు చేసుకునే హక్కు గత ఏడాది రూ.30వేలైతే ప్రస్తుతం రూ.33వేలు, సైకిల్ స్టాండ్ గత ఏడాది రూ.1.03లక్షలు ఉంటే ఈ ఏడాది రూ.1.10లక్షలు, కోనేటి పూజలు గత సంవత్సరం రూ.13వేలు పలికితే ఈసారి రూ.26వేలకు చేరింది. ఫలితంగా మొత్తం ఆదాయం గత ఏడాది కంటే రూ.1.57లక్షలు పెరిగిందని, దేవాదాయ శాఖ పరిశీలకులు ఆర్.సమత తెలిపారు. ఈఓ ఎన్.రజినికుమారి తదితరులు పాల్గొన్నారు.
లారీ ఢీకొనడంతో మహిళ మృతి
వైరా: ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టగా ఓ మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరం గ్రామ సమీపాన జరిగింది. జగ్గయ్యపేట వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఆటోను మధిర వైపు నుంచి వైరా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో ట్రాలీ ఆటోలో ఉన్న వడ్డాది వెంకటరత్నం(37) మృతి చెందగా, ఆటో నడుపుతున్న ఆమె భర్త రాముకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. కాగా, వెంకటరత్నం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తుంది. భర్త రాము ట్రాలీ ఆటోలో పరుపులు అమ్మి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.రామారావు తెలిపారు.
బొమ్మ కాలేజీకి మరో పేటెంట్
బొమ్మ కాలేజీకి మరో పేటెంట్
బొమ్మ కాలేజీకి మరో పేటెంట్


