క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ● గంగారం బెటాలియన్‌లో స్పోర్ట్స్‌మీట్ ప్రారంభం
సత్తుపల్లిరూరల్: పోలీసులు ఉద్యోగపరంగా ఎదుర్కొనే ఒత్తిడి తగ్గించుకునేందుకు క్రీడలు దోహదం చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారం 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో మంగళవారం ఇంటర్ కంపెనీ స్పోర్ట్స్‌మీట్‌ను ఆయన కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధరయాదవ్, బెటా లియన్ కమాండెంట్ ఎన్.పెద్దబాబుతో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. తొలుత బెటాలియన్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అడిషనల్ కమాండెంట్ అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీధర్‌రాజా, వేణుగోపాల్‌రెడ్డి, అశోక్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
అధికారుల పనితీరు మారాలి
వేంసూరు: వేంసూరు మండల అధికారులు పని తీరు మార్చుకుని ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. వేంసూరు తహసీల్‌లో రెవెన్యూ, విద్య, వైద్యం తదితర శాఖల అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, గ్రామాల్లో పన్నుల వసూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపుపై సూచనలు చేశారు. అలాగే, ఉపాధి హామీ పథకంలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, అధికారులు పాల్గొన్నారు.
గోదాం వద్ద పటిష్ట నిఘా
ఖమ్మం సహకారనగర్: ఈవీఎం గోదాం పటిష్ట నిఘా కొనసాగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన ఆయన అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలను పనితీరుపై ఆరా తీశాక ఉద్యోగులకు సూచనలు చేశారు. చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ఎన్నికల సూపరింటెండెంట్ ఎం.ఏ.రాజు, డీటీ అన్సారీ, ఆర్ అండ్ బీ డీఈ లఖన్‌నాయక్, ఏఇ లలిత పాల్గొన్నారు.


