రేషన్ లబ్ధిదారులకు గుడ్డ సంచులు
ఖమ్మం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యంతో పాటు గుడ్డ సంచులు కూడా అందిస్తోంది. ‘అందరికీ సన్న బియ్యం.. ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ నినాదంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి చిత్రాలు ముద్రించిన ఈ సంచులను డీలర్లకు చేరవేశారు. ఈ మేరకు రేషన్‌షాపుల్లో ఈ నెల నుంచి సంచులు అందిస్తున్నారు. అయితే, షాప్ పరిధిలోని లబ్ధిదారులకే వీటిని ఇస్తుండగా, పోర్టబులిటీ ద్వారా బియ్యం తీసుకునే వారికి కార్డు ఉన్న ప్రాంతాల్లోనే ఇవ్వనున్నట్లు అధికారులు తెలి పారు. కాగా, ఈ సంచులు 10 కేజీలు లోపు బియ్యం తీసుకెళ్లేందుకు అనువుగా ఉన్నాయి.


