
205 కేజీల గంజాయి పట్టివేత
బూర్గంపాడు: అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని మండలంలోని మోరంపల్లిబంజర వద్ద సోమవారం ఎస్‌ఐ ప్రసాద్ పట్టుకున్నారు. మంగళవారం పాల్వంచ సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు. హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన కారుడ్రైవర్ సంజీవకుమార్ తన ఓనర్ ప్రిన్స్‌కుమార్ ఆదేశాల మేరకు చింతూరుకు వచ్చి, ప్రధాన్ కారా, లఖన్ హంతాల్ వద్ద 205 కేజీల గంజాయి కొనుగోలు చేశాడు. దానిని తన రాష్ట్రానికి తరలిస్తూ మార్గమధ్యలో మోరంపల్లిబంజర వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయి, కారును స్వాధీనం చేసుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రవాణాకు సంబంధించి కారు ఓనర్ ప్రిన్స్‌కుమార్, గంజాయి అమ్మిన ప్రధాన్ కారా, లఖన్ హంతాల్‌పై కేసు నమోదు చేశామని, సంజీవకుమార్‌ను అరెస్ట్ చేశామని సీఐ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.02 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఒకరు అరెస్ట్, ముగ్గురిపై కేసు