
డ్యాన్స్ చేస్తూ.. అస్వస్థతకు గురై
బూర్గంపాడు: బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. లక్ష్మీపురం గ్రామంలో బతుకమ్మ నిమజ్జనానికి వెళ్తున్న క్రమంలో డ్యాన్స్ చేస్తూ అస్వస్థతకు గురైన యువకుడు మృతిచెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడు గుండి రమేష్(30)బతుకమ్మ నిమజ్జనంలో డీజే పాటలకు డాన్స్ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన మిగతావారు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. రమేష్ గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. డీజే సౌండ్స్‌తోనే రమేష్ గుండెపోటుకు గురైనట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.
గుండెపోటుతో యువకుడి మృతి