‘జాగృతి’ జిల్లా అధ్యక్షురాలిగా కరుణ | - | Sakshi
Sakshi News home page

‘జాగృతి’ జిల్లా అధ్యక్షురాలిగా కరుణ

Oct 4 2025 2:10 AM | Updated on Oct 4 2025 2:10 AM

‘జాగృ

‘జాగృతి’ జిల్లా అధ్యక్షురాలిగా కరుణ

ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలిగా గట్టు కరుణ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల జాగృతి రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీలను శుక్రవారం ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గతంలో పనిచేసిన కరుణను సంస్థ జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. ఆమెకు జి.సుందర్‌, డాక్టర్‌ ఎంఎస్‌.చిన్ని, వసంత్‌, ఎం.స్వరూపరాణి, అరుణశ్రీ, ఆశా, జ్యోతి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

మణుగూరు రూరల్‌: ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 233 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీలకు కేవలం ఐదు, ఒకే జెడ్పీటీసీ స్థానం కేటాయించడం దారుణమని అన్నారు. మణుగూరు మండలంలో రొటేషన్‌ ప్రకారం ఈ దఫా జెడ్పీటీసీ స్థానం ఎస్సీలకు ఇవ్వాల్సి ఉండగా, మళ్లీ ఎస్టీలకే కేటాయించారని ఆరోపించారు. కలెక్టర్‌ పరిశీలన చేసి జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కేటాయించాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు మద్దెల భద్రయ్య, వేర్పుల నరేష్‌, వేర్పుల సురేష్‌, బూర్గుల సతీష్‌, బూర్గుల సంజీవరావు, ముల్క నరేష్‌, ఏసురత్నం, వేమూరి రవి, ఉల్లోజు బాబీ, బూర్గులవెంకటరత్నం, వేర్పుల శంకర్‌, దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు

వెంకటేశ్వర్లు

‘జాగృతి’ జిల్లా  అధ్యక్షురాలిగా కరుణ
1
1/1

‘జాగృతి’ జిల్లా అధ్యక్షురాలిగా కరుణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement