
కలెక్షన్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ములకలపల్లి : పామాయిల్ రైతుల సౌకర్యార్థం మండల పరిధిలోని జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన టీజీ ఆయిల్‌ఫెడ్ కలెక్షన్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయిల్‌పామ్ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ అన్నారు. గురువారం ఆయన కలెక్షన్ సెంటన్‌ను ప్రారంభించి మాట్లాడారు. పామాయిల్ సాగు చేసే రైతులు పంటను పామాయిల్ ఫ్యాక్టరీ వరకు తీసుకెళ్లకుండా కలెక్షన్ పాయింట్‌లో కూడా విక్రయించవచ్చని తెలిపారు. ఫ్యాక్టరీలో చెల్లించే ధరకే ఇక్కడ కొనుగోలు చేస్తారని చెప్పారు. దీంతో రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు దిగుమతి కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో దమ్మపేట ఏఎంసీ చైర్మన్ వాసం రాణి, మాజీ జెడ్పీటీసీలు బత్తుల అంజి, పైడి వెంకటేశ్వరరావు, నాయకులు తాండ్ర ప్రభాకర్ రావు, పర్వతనేని అమర్‌నాథ్, పువ్వాల మంగపతి, కరుటూరి కృష్ణ, కాసాని నాగప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ రైతుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ప్రసాద్