
ఆయిల్‌పామ్‌తో స్థిర ఆదాయం
‘కల్లూరుగూడెం’ పూర్తయ్యాక
అశ్వారావుపేటలో మరో ఫ్యాక్టరీ
వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు
దమ్మపేట: ఆయిల్‌పామ్ సాగుతో రైతులు స్థిర ఆదాయం పొందుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివా రం మండల పరిధిలోని లింగాలపల్లి శివారు వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్‌పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి మంత్రితోపాటు ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, అశ్వారావుపేట, కొత్తగూడెం ఎమ్మెల్యేలు జారే ఆది నారాయణ, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యాక అశ్వారావుపేటలో మరో ఫ్యాక్టరీ నిర్మి స్తామని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, అంతర పంటల సాగు పరిశీలనకు ఆయిల్ ఫెడ్ ద్వారా రైతుల ను పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తామన్నా రు. ఫ్యాక్టరీలకు గెలలు పోటెత్తిన సందర్భాల్లో జాప్యం చేయకుండా చర్యలు తీసుకుంటామన్నా రు. పామాయిల్ మొక్కలు నాటే ప్రక్రియను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తామని తెలి పారు. భూ ధ్రువ పత్రాలతో సంబంధం లేకుండా సాగుచేసే ప్రతీ రైతుకు ఆయిల్‌పామ్ మొక్కలను ఉచితంగా అందజేస్తామని అన్నారు.
తప్పులను సరిదిద్దుతున్నాం
గతంలో ఆయిల్ ఫెడ్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆఫ్ టైప్, నాణ్యతలేని మొక్కలను తొలగించి కొత్త మొక్కలను నాటుతామని తెలిపారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారా యణ మాట్లాడుతూ ఫ్యాక్టరీల ఏర్పాటుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సాగవుతున్న వరి పంట విస్తీర్ణానికి సమానంగా పామాయిల్ సాగయ్యేలా మంత్రి తుమ్మల కృషి చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదివాసీలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, అలపాటి ప్రసాద్, చల్లగుళ్ల కృష్ణయ్య, చల్ల గుళ్ల నరసింహారావు, కందిమళ్ల కృష్ణారావు, బండి భాస్కర్, మొగళ్ల చెన్నకేశవరావు, కొయ్యల అచ్యుతరావు, పైడి వెంకటేశ్వరరావు, కాసాని నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.