ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ

Sep 1 2025 3:05 AM | Updated on Sep 1 2025 3:05 AM

ముగిస

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ

ఖమ్మం స్పోర్ట్స్‌ : రాష్ట్ర స్థాయి అండర్‌ – 15 బాలబాలికల బ్యాడ్మింటన్‌ పోటీలు నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఆదివారం ముగిశాయి. బాలుర సింగిల్స్‌ విజేతగా వరంగల్‌కు చెందిన శ్రీచేతన్‌ శౌర్య టైటిల్‌ దక్కించుకోగా, రెండో స్థానాన్ని చరణ్‌(మేడ్చల్‌) కై వసం చేసుకున్నాడు. బాలికల సింగిల్స్‌ టైటిల్‌ను అవిని విక్రమ్‌ గోవింద్‌(రంగారెడ్డి) నిలబెట్టుకోగా ద్వితీయ స్థానంలో ప్రొద్దుటూరు అనన్య(మేడ్చల్‌) నిలిచింది. బాలుర మూడోస్థానంలో చిన్మయి వాంఖడే(రంగారెడ్డి), చరణ్‌ హర్షిక్‌ విరాట(సంగారెడ్డి), బాలికల విభాగంలో శృతి(సంగారెడ్డి), ఆగర్వాల్‌(హైదరాబాద్‌) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. బాలుర డబుల్స్‌లో చరణ్‌(మేడ్చల్‌), శ్రీచేతన్‌శౌర్య(వరంగల్‌) జోడీ ప్రథమ స్థానంలో, విధిత్‌రెడ్డి, కిషోర్‌ పాల్‌(రంగారెడ్డి) రెండోస్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో అక్షర(హైదరాబాద్‌), తనిష్క(మేడ్చల్‌) జోడీ టైటిల్‌ను కై వసం చేసుకోగా, శ్రీవైభవ(నిజామాబాద్‌), ప్రొద్దుటూరు అనన్య(మేడ్చల్‌) ద్వితీయస్థానం దక్కించుకున్నారు.

విజేతలకు సీపీ బహుమతులు..

బ్యాడ్మింటన్‌ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ బహుమతులు, నగుదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబర్చారని అభినందించారు. నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అడిషినల్‌ ఎస్పీ గంటా వెంకట్రావు, జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్నాటి వీరభద్రం మాట్లాడగా కార్పొరేటర్‌ కమర్తపు మురళి, జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం కార్యదర్శి వి.చంద్రశేఖర్‌, సిరిపురపు సదుర్శన్‌ రావు, పి.రవిమారుత్‌, పి.యుగంధర్‌, కొంగర శ్రీను, జట్ల శ్రీను, మల్లికార్జున్‌, రఘు పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ

జిల్లా కమిటీ ఎన్నిక

ఖమ్మం సహకారనగర్‌ : పీఆర్‌టీయూ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన గౌరవ సలహాదారు పోట్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు దుబాకుల శ్రీనివాసరావు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కొమ్మినేని అనిల్‌కుమార్‌, గౌరవాధ్యక్షుడిగా మట్టా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ముత్తినేని సురేష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భూక్యా వీరేంద్ర, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడిగా బి.రవికుమార్‌, మహిళా అధ్యక్షురాలిగా దిగుమర్తి శిరీష, రాష్ట్ర కార్యదర్శిగా షేక్‌.కుదుస్‌, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులుగా షేక్‌ సోందు, యాస రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అంబటి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా చావా శ్రీదేవి ఎన్నికయ్యారు.

కిన్నెరసానిని

సందర్శించిన జిల్లా జడ్జి

పాల్వంచరూరల్‌ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని జిల్లా జడ్జి రాజగోపాల్‌ కుటుంబసమేతంగా ఆదివారం సందర్శించారు. డీర్‌పార్కులో దుప్పులు, జలాశయాన్ని వీక్షించారు. ఆ తర్వాత రిజర్వాయర్‌లో బోటు షికారు చేశారు. కాగా, కిన్నెరసానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పోటెత్తగా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ.20,835, టూరిజం కార్పొరేషన్‌కు రూ.9,820 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

నేత్రపర్వంగా నిత్యకల్యాణం

భద్రాచలంటౌన్‌ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ1
1/1

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement