
●నెరవేరని యూనివర్సిటీ కల
ఖమ్మంలో యూనివర్సిటీ ఏర్పాటు కల నెరవేరడం లేదు. విద్యార్థి సంఘాలు గత కొన్నేళ్లుగా ఖమ్మంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్నాయి. గతంలో పలు ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందించడంతోపాటు ఆందోళనలు నిర్వహించాయి. అయినా ఫలితం లేకుండాపోయింది. ఖమ్మంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాదిమంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీకి లేదా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అనేకమంది ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.