
●కంపెనీల జాడేది?
తల్లాడ మండలం బుగ్గపాడులో 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన మృతితో ఫుడ్‌పార్క్ మూలన పడింది. 2017లో అప్పటి మంత్రులు కేటీఆర్, తుమ్మల దృష్టి సారించగా.. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఫుడ్‌పార్క్‌ను సందర్శించారు. 2018లో రెండు కంపెనీలు వచ్చినా వెనక్కు వెళ్లాయి. భూమి ధర ఎక్కువగా ఉండటంతోనే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఫలితంగా ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగాయి.