సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఖమ్మం సహకారనగర్: నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ సెల్‌లో ఐబీఎం ఇండియా అందించిన రూ.3.9లక్షల నిధులతో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా శనివారం ప్రిన్సిపాల్ జి.పద్మావతి వివరాలు వెల్లడించారు. అధ్యాపకులు, సిబ్బంది శ్రీనివాసరావు, తిరుమలాదేవి, కృష్ణవేణి, కృష్ణకుమారి, ట్రస్ట్ బాధ్యులు నవీన్ పాల్గొన్నారు.
హిందీ భాష వినియోగం పెరగాలి
ఖమ్మంగాంధీచౌక్: వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో హిందీ భాషను మరింత ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరముందని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ వెంకటనారాయణ అన్నారు. ఖమ్మంలో శనివా రం నిర్వహించిన నగర అధికారిక భాష అమలు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర, ప్రత్యుత్తరాలను హిందీలో అమలు చేయాలని సూచించారు. ఎస్‌బీఐ ఏజీఎం వెంకటనారాయణ, చీఫ్ మేనేజర్ ప్రసన్నకుమార్, యూనియన్ బ్యాంక్ డీజీఎం పార్థసారథి మురళి, కేంద్ర హోంశాఖ అధికారి నరేంద్ర సింగ్ మెహ్ర, తదితరులు పాల్గొన్నారు.
1వ తేదీనే పింఛన్లు ఇవ్వాలి
ఖమ్మం సహకారనగర్: ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వాసిరెడ్డి మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి కల్యాణం నాగేశ్వరరావు మాట్లాడుతూ పింఛన్ చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కార్డులు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం సమర్పించారు. నాయకులు టీ.ఎన్.రావు, గణపతి, రాములమ్మ, వీరబాబు, శ్రీధర్, మాధవరావు, వీరయ్య, రామయ్య, ఉపేంద్ర, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న పెన్షనర్లు


