మహిళా టెక్కీ బాత్‌రూంలో మొబైల్‌ రికార్డింగ్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళా టెక్కీ బాత్‌రూంలో మొబైల్‌ రికార్డింగ్‌

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

బనశంకరి: యువతి స్నానం చేస్తున్న బాత్‌రూమ్‌ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌లో మొబైల్‌ఫోన్‌ పెట్టి వీడియో చిత్రీకరణకు యత్నించిన ఘటన బెంగళూరులో కోరమంగల 7వ బ్లాక్‌లో జరిగింది. స్థానిక మహిళా టెక్కీ (29) ఈ ఘటనతో భయాందోళనకు గురైంది.

ఏం జరిగిందంటే..

ఫిర్యాదు మేరకు వివరాలు... యువతి నగరంలో ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఈ నెల 20వ తేదీ రాత్రి 9:40 సమయంలో జిమ్‌ నుంచి ఇంటికి చేరుకుంది. బాత్‌రూమ్‌లో గీజర్‌ ఆన్‌చేసి, 20 నిమిషాల తరువాత స్నానానికి వెళ్లింది. ఈ సమయంలో బాత్‌రూమ్‌లో షవర్‌ వద్ద దుమ్ముధూళి పడి ఉంది, అంతేగాక బకెట్‌లో ఒక స్క్రూ పడి ఉండటం చూసి శుభ్రం చేసింది. ఆమె స్నానం చేస్తూ కొంతసేపటికి షవర్‌పైన ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ వైపు చూసింది. ఫ్యాన్‌ బ్లేడ్ల మధ్య మొబైల్‌ఫోన్‌ ఉండడం చూసి కంగారుపడింది. మొబైల్‌ను చూసిన యువతి గట్టిగా కేకలు వేస్తూ ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆమె టెర్రెస్‌ మీదకు వెళ్లి చూడగా ఎవరూ లేరు.

పోలీసులకు ఫిర్యాదు

మొబైల్‌ స్వాధీనం

గుర్తుతెలియని వ్యక్తి తాను స్నానం చేస్తున్న దృశ్యాలు మొబైల్‌ ద్వారా వీడియో తీశాడని యువతి కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో యజమాని నివాసం ఉంటుండగా, మొదటి అంతస్తులో తాను ఒక్కతే ఉంటానని, ఇంటి చుట్టుపక్కల ఒకటి రెండు షెడ్లు ఉన్నాయని తెలిపింది. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి ఆ మొబైల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement