యశవంతపుర: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలలో రూ.3.77 కోట్ల విలువగల విదేశీ బంగారంతో పాటు రూ.73 లక్షల నగదు, 1.3 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. దుబాయ్ సహా విదేశాల వచ్చే ప్రయాణికులు, ఈ ఉద్యోగులు ముందుగానే మాట్లాడుకునేవారు. ప్రయాణికులు దొంగగా తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్‌పోర్టు టాయ్‌లెట్లలో దాచేవారు. దానిని ఉద్యోగులు పట్టుబడకుండా బయటకు తీసుకొచ్చేవారు.
నిందితుల అరెస్టు
ఈ నెల 23వ తేదీన కూడా ఇలా బంగారాన్ని బయటకు తీసుకొచ్చారని తెలిసి డీఆర్‌ఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. పేస్ట్ రూపంలో ఉన్న రెండు బంగారం ఉండలను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో వేచి ఉన్న మరో వ్యక్తికి వీటిని అందించడానికి వెళ్తున్నట్లు తెలిపాడు. నిందితులను అరెస్టు చేశారు. వారిని తీవ్రంగా విచారించి ఇప్పటివరకు తరలించిన రూ.3.77 కోట్ల బంగారాన్ని, నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. మరో కేసులో మస్కట్ నుంచి వచ్చిన కాసరగోడువాసి లగేజీలో 1.3 కేజీల సింథటిక్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళ మున్నార్‌కు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ప్రయాణికులతో కలిసి బంగారం స్మగ్లింగ్
టాయ్‌లెట్ నుంచి బయటకు తరలింపు


