ప్రశాంత్‌కే బంగారు అంబారీ పట్టం | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌కే బంగారు అంబారీ పట్టం

Oct 15 2026 8:18 AM | Updated on Oct 15 2026 8:18 AM

మైసూరు: ప్రసిద్ధ మైసూరు దసరా మహోత్సవాలలో ఈసారి విజయదశమి రోజున జంబూసవారీలో అమ్మవారి బంగారు అంబారీని మోసే భాగ్యం ఏ గజరాజుకు దక్కేనా? అని అంతటా ఉత్కంఠ ఏర్పడింది. కొందరు సరదాగా పందేలు కూడా కాశారు. చివరికి ప్రశాంత్‌కు ఈ అదృష్టం లభించింది. 54 ఏళ్ల వయసున్న ప్రశాంత్‌ను బుధవారం ఎంపిక చేశారు. గత 17 ఏళ్లుగా మైసూరు దసరా వేడుకల్లో ఈ గజం పాల్గొంటోంది. జంబూ సవారీలో బంగారు అంబారీని మోసే ఏనుగుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏనుగు ఆరోగ్యం, దీక్షాదక్షతలను పరిశీలించి ప్రశాంత్‌కు చాన్స్‌ ఇచ్చారు. ప్రశాంత్‌ శాంత స్వభావం, మావటీల సూచలకు స్పందించే లక్షణం సెలెక్టర్లను ఆకట్టుకున్నాయి. సుగ్రీవ, ధనంజయ, ఏకలవ్య తదితర ఏనుగుల కంటే అన్నింటా మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. మంత్రి యతీంద్ర మాట్లాడుతూ మెరుగైన లక్షణాల వల్ల ప్రశాంత్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు.

బుధవారం గజశాలలో ఏనుగు ప్రశాంత్‌

మైసూరులో కంబళ పోటీల కోసం సాధన

ప్రభుదేవా స్పెషల్‌

ప్యాలెస్‌ ముందు వేదికపై దసరా మహోత్సవంలో ప్రభుదేవా యువ సంభ్రమ, కన్నడ గీతాలాపనలు, సినిమా పాటలు ప్రేక్షకుల మనసును దోచాయి. యువ దసరాను ప్రముఖ నటుడు, డ్యాన్సర్‌ ప్రభుదేవా ప్రారంభించారు. పట్టు అంగీ, పంచెతో సంప్రదాయరీతిలో వేదికపైకి వచ్చారు. డ్యాన్సర్లతో కలిసి నృత్యాలతో రంజింపజేశారు.

పాటల పల్లకి

గాయకుడు అజయ్‌ వారియర్‌, గాయని అనురాధ భట్‌ తీయని స్వరంతో కన్నడ పాటలను ఆలపించారు. జనరంజకమైన పాటలను పాడగా, ప్రేక్షకులు సంతోషం పట్టలేక గంతులేశారు. గాయని భాగ్యశ్రీ బృందం భక్తిగీతాలాపన తన్మయుల్ని చేశారు.

గుణగణాల దృష్యా బృహత్‌ బాధ్యత

ఉత్సాహంగా మైసూరు దసరా

మహోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement