మండ్య: తెలిసీ తెలియని వయసులో ప్రేమ వ్యామోహంలో పడడం, అడ్డుచెప్పే కుటుంబసభ్యులనే అంతమొందించడం అక్కడక్కడా జరుగుతోంది. ప్రేమకు అడ్డు వస్తోందనే సొంత అవ్వనే హత్య చేసిందో మనమరాలు. ఈ సంఘటన జిల్లాలోని కేఆర్ పేటె తాలూకా బూకనకెరె గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మహదేవమ్మ (52)ను మనమరాలు కీర్తన, ప్రియుడు ఆకాశ్ కలసి హతమార్చారు.
దిండుతో అదిమి, తాడు బిగించి
వివరాలు.. కీర్తన, ఆకాశ్ ప్రేమ విషయం తెలిసి అవ్వ (అమ్మమ్మ) మహదేవమ్మ ఇది సరికాదని మనవరాలిని హెచ్చరించింది. అబ్బాయి మంచివాడు కాదు... ప్రేమ, పెళ్లి వంటివి ఏమి వద్దని దండించడంతో కోపం పెంచుకున్న కీర్తన ఆకాశ్కు చెప్పింది. ఆమె ఉంటే మన ప్రేమ సాగదని భావించి హత్యకు తీర్మానించారు. ఆమె నిద్రపోతుండగా ఇద్దరూ కలిసి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత తాడుతో గొంతు బిగించి ప్రాణం తీశారు. గ్రామస్తుల ద్వారా తెలిసిన వెంటనే కేఆర్ పేటె పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని కీర్తనను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికను శివమొగ్గలోని బాలమందిరానికి తరలించారు. ఆకాశ్ పరారీలో ఉన్నాడు.
ప్రేమకు అడ్డొచ్చిందని అవ్వ హత్య
మండ్య జిల్లాలో కిరాతకం


