రేపటి నుంచి ఏసియా జ్యువెల్స్‌ షో | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఏసియా జ్యువెల్స్‌ షో

Oct 15 2026 8:18 AM | Updated on Oct 15 2026 8:18 AM

సాక్షి, బెంగళూరు: ఏటా నగరవాసులను అలరించే ఏసియా జ్యువెల్స్‌ షో–2026 స్వర్ణాభరణాల ప్రదర్శన, విక్రయాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వివాహాది, పండుగల సీజన్‌ కావడంతో బెంగళూరు నగర వాసులను అబ్బురపరిచేందుకు కొంగొత్త, ప్రత్యేకమైన ఆభరణాలను ఏసియా జ్యువెల్స్‌ షో తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. బెంగళూరులోని జేడబ్ల్యూ మ్యారియట్‌ హోటల్‌లో 3 రోజుల పాటు ఈ ఆభరణాల ప్రదర్శన జరగనుంది.

రోడ్డు పక్కన ఓటరు,

పాన్‌ కార్డులకు నిప్పు

యశవంతపుర: హాసన్‌ జిల్లా సకలేశపుర పట్టణంలోని శ్రీగంధ హోటల్‌ దగ్గర పలు రకాల గుర్తింపు కార్డులను పడేసి నిప్పుపెట్టారు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎలక్షన్‌ గుర్తింపు కార్డులు, ఆధార్‌, పాన్‌ కార్డ్‌లు ఉన్నాయి. రామనగర, కొట్టూరు, బళ్లారి, విజయపుర, మైసూరుతో పాటు అనేక జిల్లాలు, తెలుగులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్‌లున్న కార్డులను గుర్తు తెలియని వ్యక్తులు పడేసి అగ్గి పెట్టారు. సగం సగం కాలిపోయాయి. సకలేశపుర పోలీసులు పరిశీలించారు. ఇవి సకలేశపురకు ఎలా వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు అనేది విచారణ చేపట్టారు.

కొడగు జిల్లాలో

బంగ్లాదేశీల అరెస్టు

యశవంతపుర: కొడగు జిల్లా పొన్నంపేట తాలూకా బాళెలె గ్రామంలో అక్రమంగా ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను గుర్తించారు. ఒక తోటలోని ఇంటిలో మకాం వేసి కూలిపనులు చేస్తున్న నలుగురిని హిందూ జాగరణ వేదిక, ఆటో డ్రైవర్ల సంఘం కార్యకర్తలు గుర్తించి పోలీసులకు అప్పగించారు. బంగ్లాదేశ్‌లోని నియాస్పుర్‌ అని, బ్రోకర్‌ సాయంతో సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చినట్లు పోలీసులతో ఒప్పుకున్నారు. జిల్లాలో పెద్దసంఖ్యలో అక్రమంగా బంగ్లాదేశీయులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాఫీ తోటల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వలసదారులను గుర్తించడంలో పోలీసులు విఫలమైనట్లు ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

226కు చేరిన కరువు తాలూకాలు

బనశంకరి: ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. 31 జిల్లాల్లో 236 తాలూకాలకుగాను 217 తాలూకాలను కరువుపీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మరో 9 తాలూకాలను అందులో చేర్చింది. 10 తాలూకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బుధవారం నగరంలో డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ మీడియాతో మాట్లాడారు. మొత్తం కరువు పీడిత తాలూకాలు సంఖ్య 226 కు చేరుకుందన్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హాసన్‌, బెళగావి, శివమొగ్గ, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లోని తాలూకాలను కొత్తగా చేర్చినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement