● హైవేలలో ఆటంకం
బనశంకరి: టన్ను చెరకుకు రూ.5,500 ధర ప్రకటించాలి, చక్కెర కనీస విక్రయ ధర పెంపు, రాష్ట్రంలో ఉత్పత్తిఅయ్యే ఎథనాల్ను కేంద్రం కొనుగోలు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తక్షణం అమలు చేయాలని పట్టుబడుతూ రాష్ట్రంలో హైవేలను చెరకు రైతులు రెండవరోజు బుధవారం కూడా దిగ్బంధించారు. దీంతో హైవేలపై వాహన సంచారం దాదాపుగా స్తంభించింది. ఉత్తర కర్ణాటకలో బెళగావి, బాగల్కోటే జిల్లాల్లో చెరకు రైతులు హైవేలపై బైఠాయించి వంటావార్పు కూడా చేస్తున్నారు. మంగళవారం రాత్రి అక్కడే నిద్రించారు. పూణే–బెంగళూరు హైవేను ఎక్కడికక్కడ దిగ్బంధించారు. దీంతో లారీల డ్రైవర్లు వాహనాలను నిలిపేశారు. అలాగే ధార్వాడ శివారులోని బైపాస్ రోడ్డులో రైతులు వాహనాలు అడ్డుకుని ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం 12వ తేదీన రైతులతో జరిపిన సమావేశం విఫలమైందని రైతులు ఆరోపించారు. కాగా, పోలీసులు రైతులను అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.
2వ రోజు చెరకు రైతుల ఆందోళన


