బనశంకరి: సోషల్ మీడియాలో ‘నకిలీ వీడియో’ పోస్టు చేసి మాజీ సీఎం సిద్దరామయ్య గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించిన కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారిని రహస్య ప్రదేశానికి తరలించారు. వీడియోలను ఎక్కడ సృష్టించారు, ఎవరెవరికి పంపించారు, ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్మీడియాలో తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలను దురుద్దేశంతో షేర్ చేసి పరువు నష్టం కలిగిస్తున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య నగర పోలీస్కమిషనర్ సీమంత్కుమార్ సింగ్కు ఫిర్యాదు చేశారు. ఆ సోషల్ మీడియా అకౌంట్లు తదితర వివరాలను అందజేశారు. కమిషనర్ సీసీబీ, సైబర్ క్రైంకు కేసును అప్పగించారు. సైబర్ క్రైం పోలీసులు వీడియోలను ప్రసారం చేసిన ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ తదితర ఖాతాల ఐపీ అడ్రస్ల ద్వారా ఖాతాల యజమానులను గుర్తించడంలో నిమగ్నమయ్యారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికి ఇద్దరు అనుమానితులను నిర్బంధంలోకి తీసుకున్నారు.
కాంగ్రెస్లో కల్లోలం: విజయేంద్ర
శివమొగ్గ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని, సీఎం పదవి గురించి సంఘర్షణలు తీవ్రతరం అయ్యాయని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. మూడో ముఖ్యమంత్రి వచ్చినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. శివమొగ్గ జిల్లా హోసనగరలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కలహాలతో విసిగిపోయిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. 25 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మరోసారి ప్రకటించారు. మంత్రులకు స్టింగ్ ఆపరేషన్ భయం అంటుకుంది, సిద్దరామయ్య వర్గం అణచివేతకు యత్నాలు జరుగుతున్నాయన్నారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్నారని
మాజీ సీఎం సిద్దు ఫిర్యాదు
బెంగళూరు సీసీబీ,
సైబర్క్రైం పోలీసుల దర్యాప్తు
ఇద్దరు అనుమానితుల అరెస్టు
వీడియోల వెనుక సూత్రధారి కోసం చూపు
సిద్దుతో మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మంతనాలు
మైసూరు: రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు రోజుకొక మలుపు తీసుకుంటున్నాయి. సిద్ధరామయ్యను బుధవారం బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహొళి భేటీ కావడం చర్చనీయాంశమైంది. మైసూరులోని టీకే లేఔట్లో ఉన్న సిద్ధరామయ్య నివాసానికి రమేశ్ వెళ్లి కొంతపు మాట్లాడారు. భేటీ తరువాత వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. ఇదొక స్నేహపూర్వక భేటీ అని, సిద్ధరామయ్య ఎప్పటికీ తమ నాయకుడని చెప్పి కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత సిద్ధరామయ్య మాట్లాడుతూ రమేశ్ జార్కిహొళి ఊరికే వచ్చారని, ఉభయ కుశలోపరి ప్రశ్నలు వేసుకున్నామని చెప్పారు. మంత్రి నరేంద్రస్వామి కూడా మామూలుగానే కలిసి భోజనం చేశారని, ఈ భేటీలకు వేరే అర్థాలు కల్పించవద్దని సిద్దు మనవి చేశారు.
మాజీ సీఎం సిద్దరామయ్యపై స్టింగ్ ఆపరేషన్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించడం, స్వయంగా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో అందరి దృష్టి దీని మీద పడింది. ఏమిటా స్టింగ్ ఆపరేషన్, ఏమి వీడియోలు అనే ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఈ నేపథ్యంలో కొందరు సిద్దరామయ్య వీడియోలంటూ నకిలీ వీడియోలను ఇంటర్నెట్లోకి వదిలి గందరగోళం సృష్టిస్తున్నారు. సిద్దరామయ్య ఫిర్యాదు మేరకు నగర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరామర్శా..? అన్నట్లుగా ఓ మంత్రి, మాజీ మంత్రి మైసూరులో సిద్దరామయ్యను కలిశారు. ఇంకోవైపు బీజేపీ నేత విజయేంద్ర 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమవైపు చూస్తున్నారని మరోసారి ప్రకటించారు. మునుముందు రాజకీయ ఆట తీవ్రమయ్యే సూచన ఉంది.


