ఉత్సాహంగా ఆటల పోటీలు..
మన క్రీడాకారులు రాష్ట్ర కీర్తిని దేశవ్యాప్తంగా వ్యాపిస్తుండటం గర్వకారణమని కొప్పళ గవి మఠాధిపతి గవిసిద్ధేశ్వర స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం చాముండి విహార జిల్లా క్రీడాంగణాన్ని సందర్శించారు. బెంగళూరు గ్రామీణ, కలబుర్గి జట్ల మధ్య వాలీబాల్ పోటీలను వీక్షించారు. తరువాత 400 మీటర్ల రిలే పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. గవి సిద్ధేశ్వర స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామి మఠాన్ని సందర్శించి స్వామీజీతో సమావేశమయ్యారు. మఠంలోని పక్షుల ఆశ్రమంలో అపురూపమైన చిలుకలను చూసి సంభ్రమానికి గురయ్యారు.
కవిత చెబితే మొక్క ఉచితం..
దసరా పుస్తక మేళాకు వచ్చిన వారు ఒక కవితను చెబితే వారికి ఒక మొక్కను బహుమతిగా అందజేస్తున్నారు. సామాన్యంగా పుస్తక మేళాకు సాహితీవేత్తలు, కవులు కూడా వస్తుంటారు. అందువల్ల వారికి కవితల పోటీని చేర్చారు. తుమకూరు జిల్లాకు చెందిన పుస్తక విక్రేత సంతోష్ మడేనూరు ఇలా కవిత చెప్పండి.. మొక్క పొందండి అనే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. పలువురు కవితలు చెప్పి మొక్కలు అందుకున్నారు.
మైసూరు: విశ్వవిఖ్యాత నాడహబ్బ మైసూరు దసరా కన్నులపండువగా సాగుతోంది. పలు వేదికలలో వైవిధ్యమైన వేడుకలు, వెల్లువెత్తిన పర్యాటకులతో నగరం కళకళలాడుతోంది. సాయంత్రం నుంచి విద్యుద్దీప కాంతుల్లో అలరారుతోంది, ఇక టూరిజం ఓపెన్ బస్సుల్లో నగరవాసులు, పర్యాటకులు నగర విహారంతో మురిసిపోతున్నారు.
మహిళా దసరా సంబరాలు..
మూడో రోజు మంగళవారం మహిళా దసరాను జేకే మైదానంలో జిల్లా మంత్రి యతీంద్ర శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ మహిళలే ఈ సమాజపు శక్తి, కుటుంబానికి ఆధార స్తంభాలు అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ఎక్కువ అవకాశాలు లభించాలన్నారు. సరైన అవకాశాలు దక్కితే మహిళల శక్తి ఏమిటో అందరికీ తెలుస్తుందన్నారు. బుద్ధుడు, బసవణ్ణ, అంబేడ్కర్ వంటి మహా నాయకులు మహిళల సమానత కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. మంత్రి సీ.పుట్టరంగశెట్టి, ఎమ్మెల్యే హరీష్గౌడ, పద్మావతి, పుష్పా అమరనాథ్ పాల్గొన్నారు. మహిళలకు పలు క్రీడా పోటీలను నిర్వహించారు.
మైసూరులో కన్నులపండువ


