పెళ్లి చేసుకుంటానని వంచన | - | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని వంచన

Oct 14 2026 4:23 AM | Updated on Oct 14 2026 4:23 AM

మండ్య/దొడ్డబళ్లాపురం: పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేసిన యువకుడు.. తాళి కట్టేందుకు ముఖం చాటేశాడు. న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది.

వివరాలు.. హాసన్‌ జిల్లా చన్నరాయపట్న తాలూకా కల్లేసోమహళ్లికి చెందిన సూర్య (26), కేరళలోని కాసరగోడ్‌కు చెందిన నిష్మ (26) బెంగళూరులోని వైట్‌బర్డ్‌ కంపెనీలో పని చేస్తున్నారు. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో ఐదు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. మొదట వీరి పెళ్లికి అంగీకరించిన సూర్య తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఒప్పుకోలేదు. మరోవైపు నిష్మ తల్లి కూడా ఈ పెళ్లిని వ్యతిరేకించినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 24న సూర్య తన మొబైల్‌ ఫోన్‌ను అక్కడే వదిలి అదృశ్యమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి సూర్య తనను మోసం చేశాడని బాధపడిన నిష్మా.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకుముందు తన చావుకి సూర్య, అతడి తల్లిదండ్రులు, స్నేహితుడు ప్రవీణ్‌ కారణం అంటూ వీడియో పెట్టింది. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బెంగళూరు మహాలక్ష్మి లేఔట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

విషం తాగి యువతి ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement