శివాజీనగర: రాష్ట్రంలో ఏ క్షణంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, కొందరు మంత్రులతో పాటు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారు అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. బెంగళూరులో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు యూపీఏకు కొన్ని సీట్లు ఇచ్చారని, వచ్చేసారి అలా జరగదన్నారు. కర్ణాటక రాజకీయాలు ఇంత నీచ స్థాయికి ఎన్నడూ దిగజారలేదు, రాజకీయ నేతలపై ప్రజలకు విరక్తి కలిగింది, ఇలాంటి సమయాల్లో స్టింగ్ ఆపరేషన్లు జరపడం అస్సలు మంచిది కాదు, పదవుల కోసం ఇలాంటి నీతిమాలిన పనులు చేస్తారా? అని దుయ్యబట్టారు.


