సన్మానం | - | Sakshi
Sakshi News home page

సన్మానం

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

రాయచూరు రూరల్‌: వైద్య రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించాలని శిల్పా ఫార్మసీ సైన్స్‌ పరిశీలకుడు సతీష్‌ కుమార్‌ పిలుపు ఇచ్చారు. నవోదయ వైద్య కళాశాలలో సీజీఎంపీ– 2026 దినోత్సవాన్ని ప్రారంభించి ఔషధ విధానం, ఉత్పత్తి, విశ్లేషణ, క్లినికల్‌ ఫార్మసీ, రీసెర్చ్‌, ఫార్మోకోమో వంటి అంశాలపై మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య పరీక్షలు చేయవచ్చన్నారు. నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ దొడ్డయ్య, రాజే్‌ష్‌, పవన్‌, విశ్వనాథ్‌, ఆదిత్యలున్నారు.

పేదలకు ఇళ్లు మంజూరు చేయరూ

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ పథకంలో వెనుక బడిన వర్గాల శాఖ నుంచి మురికి వాడల ప్రజలకు నిధులు మం జూరు చేయాలని మురికి వాడల నిర్మూలన వేదిక డిమాండ్‌ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు జనార్దన్‌ మాట్లాడారు. వీధి వ్యాపారస్తులకు, కుష్టురోగులకు, దివ్యాంగులకు, సఫాయి కర్మచారులకు, దేవదాసి మహిళలకు, వితంతువులకు, పేదలకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

రైతులకు కరువు పరిహారం ఏదీ?

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని ఉత్తర, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో తీవ్ర కరువు సంభవించినందున రైతులకు కరువు పరిహారం అందించి కరువు సహాయక పనులు ప్రారంభించాలని కర్ణాటక రక్షణ వేదిక స్వాభిమాని కన్నడిగ అధ్యక్షుడు లక్ష్మణ్‌ బోవి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతుంటే ప్రజా ప్రతినిధులు సంబరాల్లో పాల్గొనడం తగదన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదన్నారు. గేజ్‌ నిర్వహణలో లోపాలను సవరించాలన్నారు. కరువు పరిహారం కింద ఎకరాకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని, రైతులకు గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేపట్టాలని కోరారు.

బన్ని మహంకాళికి

ప్రత్యేక పూజలు

హొసపేటె: నగరంలోని 25వ వార్డు కంచగార్‌పేటలో ఉన్న బన్ని మహంకాళి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి గంగా పూజ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పనులు పూర్తి కావడంతో కంచగార్‌పేట ప్రాంత భక్తుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని భక్తులు ప్రార్థించారు.

వేతన బకాయిలు చెల్లించండి

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్‌వర్క్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు బకాయి వేతనాలను చెల్లించాలని తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్‌వర్క్‌ కార్మికుల సంఘం అధ్యక్షుడు మానసయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది ఆయకట్టు కింద క్రాప్‌ హాలిడే ప్రకటించడంతో తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల చేయకపోవడంతో వేతనాలు చెల్లించ లేదన్నారు. పనులు లేవన్న కారణంగా బకాయి వేతనాలివ్వడం కుదరదని ఇంజనీర్లు విజయలక్ష్మి, సత్యనారాయణ శెట్టి వేతనాలు ఇవ్వక పోవడంతో కలబుర్గి కోర్టులో కేసు వేశామన్నారు. ఈనెల 22వ తేదీలోగా కార్మిక కోర్టుకు వేతనాల సొమ్ము చెల్లించాలని ఆదేశించారన్నారు. తద్వారా 222 మంది కార్మికులకు 80 రోజుల వేతనాలు చెల్లించడానికి అవకాశం కల్పించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement