లలితాదేవి నమోస్తుతే.! | - | Sakshi
Sakshi News home page

లలితాదేవి నమోస్తుతే.!

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

బళ్లారి అర్బన్‌: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మూడో రోజు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరిపారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లను ప్రతి రోజూ వివిధ రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించారు. ఆలయాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు, దేవస్థాన అధ్యక్షులు, ప్రతినిధులు తెలిపారు.

రాయచూరులో..

రాయచూరు రూరల్‌: జిల్లాలో మంగళవారం శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని అల్లమప్రభు కాలనీలోని బిల్వ మందిరలో మాతా అంబా భవానికి పూజలు జరిపారు. కోటలో కాళికా దేవి ఆలయంలో దేవిని పల్లకీలో ఊరేగించారు. దేవసూగూరులో నాగర యల్లమ్మను పూలతో, మమదాపురలో మారికాంబను, కిల్లే బృహన్మఠంలో అమ్మవారిని అలంకరించారు. గుంజళ్లిలో కిల్లే బృహన్మఠం శాంతమల్ల శివాచార్యులు విశేష పూజలు జరిపారు. ప్రత్యేక అలంకరణలో కందగడ్డ మారెమ్మ, కల్లూరులో మహాలక్ష్మీ దేవి, నీరమాన్విలో యల్లమ్మ దేవిలను అలంకరించారు.

శరన్నవరాత్రుల్లో మూడో రోజు వివిధ రూపాల్లో అమ్మవారికి అలంకరణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement