మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

రాయచూరు రూరల్‌: నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్‌ పూవిత పేర్కొన్నారు. శుక్రవారం మహవీర్‌ చౌక్‌, మహాబళేశ్వర చౌక్‌, షరాఫ్‌ బజార్‌, వాసవి నగర్‌, జవహర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాకాలంలో మురుగు నీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని తెలిపారు. నగరసభ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, పరిసరాల పరిశుభ్రతను పాటించని వారికి జరిమానా విధించాలన్నారు. వర్షాకాలంలో వర్షపు నీరు రోడ్లపైకి చేరకుండా, కాలువల ద్వారా సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నగర పాలికె కమిషనర్‌ జుబీన్‌ మొహపాత్రో, స్వచ్ఛత నోడల్‌ అధికారి కృష్ణ శావంత్‌ గేర్‌, జైపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement