పాతకక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పాతకక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం

Oct 10 2026 1:34 AM | Updated on Oct 10 2026 1:34 AM

బళ్లారి అర్బన్‌: పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై హత్యయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను బళ్లారిలోని గాంధీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సుమన్‌ పన్నేకర్‌ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మధు అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కోర్టులో పని ముగించుకుని ఈనెల 8న సాయంత్రం కారులో బయలుదేరాడు. బళ్లారి నగరంలోని తాలూరు రోడ్డు శ్రీ నంది కిరాణ దుకాణం సమీపంలో ఐదుగురు వ్యక్తులు మోటర్‌ సైకిళ్లతో కారును అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలతో దాడి చేసి గాయపరిచారు. వారి నుంచి తప్పించుకున్న మధు.. గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పాతకక్షలతో హత్య చేసేందుకు ప్రయత్నించారని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో నిందితులు మొబైల్‌ ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసి నగరం విడిచి పారిపోయినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో గాలింపు చేపట్టిన పోలీసులు కొప్పళ జిల్లా కనకగిరి సమీపంలో అక్కడి పోలీసుల సహకారంతో శుక్రవారం తెల్లవారుజామున ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన వారిలో బళ్లారికి చెందిన సతీష్‌, విక్రమ్‌ అలీయాస్‌ విక్కి, రవి అలీయస్‌ డీల్‌ రవి, షేక్‌ షావలి, ఖలీల్‌ బాషా ఉన్నారు. నిందితుల నుంచి ఒక కారు, మూడు మోటారు సైకిళ్లు, దాడికి ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సతీశ్‌పై గతంలో ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదైంది. రవి అలియాస్‌ డీల్‌ రవిపై హత్య, దోపిడీ, జూదం దాడి తదితర ఐదు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. హత్యాయత్నం ఘటనలో మొత్తం 9 మంది పాల్గొన్నట్లు విచారణ వెల్లడైంది. మిగిలిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుమన్‌ డి.పన్నేకర్‌, అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ మార్గదర్శకత్వంలో డీఎస్పీ గోవిందరాజులు, పోలీసు, ఇన్‌స్పెక్టర్లు రవిచంద్రన్‌, డీబీ మహంతేశ్‌, మహమ్మద్‌ రఫీక్‌ ఈ కేసును చేధించినట్లు జిల్లా పోలీసు శాఖ తెలిపింది.

ఐదుగురు అరెస్ట్‌

మరో నలుగురి కోసం పోలీసుల గాలింపు

వ్యక్తిపై మారణాయుధాలతో దాడి

8 మందిపై కేసు నమోదు

హుబ్లీ: స్థానిక కేశ్వపుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బెంగేరి సంత మైదానంలో హ్యారీస్‌ అనే వ్యక్తిపై మరుణాయుధాలతో దాడి చేసిన కేసుకు సంబంధించి 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హ్యరీస్‌ కుటుంబంతో కలసి బెంగేరి సంత మైదానంలో బంధువుల పెళ్లికి వెళ్లిన సందర్భంలో పాతకక్షలతో నిందితులు ఫిస్తోల్‌, తల్వార్‌తో దాడి చేశారు. హుబ్లీ కార్వార రోడ్డు తాజ్‌ హోటల్‌ వద్ద జరిగిన ఫ్రూట్‌ ఇర్ఫాన్‌ హత్య కేసు నేపథ్యంలో ఈ దాడి జరిగిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. అర్బాజ్‌, సలగర, దాదాపీర, ఇస్మాయిల్‌, ఇక్బాల్‌, రహీమ్‌, తౌసిప్‌, రియాజ్‌ షేక్‌ తదితరులపై కేసు నమోదు చేశారు. అంబాజ, ప్రేమ్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement